01 November 2011

విరహ వీణ హా నిదుర రాక వేగే వేళలో

విరహ వీణ హా నిదుర రాక వేగే వేళలో
శృతిని మించి రాగమేదో పలికే వేళలో
మౌనమైన గానమేదో నీవే తెలుసుకో ఓ
విరహ వీణ నిదుర రాక వేగే వేళలో
ఆ ఆ వేగే వేళలో

జడలో విరులే జాలిగ రాలి జావళి పాడేనురా
సా పదసరిగ గా దపదసరి గాదపాగ
గాపరీగ సరిగరి సరిగప రీగద గాపస పాదపా దా పా సా దా రీ
ఒడిగా మిగిలే ఒంటరితనమే నీతోడు కోరేనురా ఆ

జడలో విరులే జాలిగ రాలి జావళి పాడేనురా
ఒడిగా మిగిలే ఒంటరితనమే నీతోడు కోరేనురా
లేలేత వలపు సన్నాయి పిలుపు రావాలి సందిళ్ళ దాకా
మన పెళ్ళిపందిళ్ళ దాకా ఆ ఆ
విరహ వీణ హా నిదుర రాక వేగే వేళలో ఆ వేగే వేళలో

ఎదలో కదిలే ఏవో కథలు ఏమని తెలిపేదిరా
చీకటిపగలు వెన్నెల సెగలు నీ నీడ కోరేనురా
ఈ నాటకాలు మన జాతకానా రాశాయిలే ప్రేమలేఖా
ఈ దూరమెన్నాళ్ళ దాకా ఆ ఆ

విరహ వీణ హా నిదుర రాక వేగే వేళలో
శృతిని మించి రాగమేదో పలికే వేళలో
మౌనమైన గానమేదో నీవే తెలుసుకో ఓ
విరహ వీణ నిదుర రాక వేగే వేళలో వేగే వేళలో

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips