01 November 2011

ఎలా తెలుపను ఇంకెలా తెలుపను

ఎలా తెలుపను ఇంకెలా తెలుపను
మదినిండా నీవే ఉంటే ఒక మాటైనా రాకుంటే
ఎలా తెలుపను ఇంకెలా తెలుపను

ఎన్నడు అందని పున్నమి జాబిలి
ఎన్నడూ అందని పున్నమి జాబిలీ
కన్నుల ముందే కవ్విస్తుంటే

కలగా తోచి వలపులు పూచీ
కలగా తోచి వలపులు పూచీ
తనువే మరచి తడబడుతుంటే

గుడిలో వెలసిన దేవుడు ఎదురై
గుడిలో వెలసిన దేవుడు ఎదురై
కోరని వరాలే అందిస్తుంటే

ఆ భావనలో ఆరాధనలో
ఆ భావనలో ఆరాధనలో
అంతట నీవే అగపడుతుంటే

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips