01 November 2011

ఎలా ఎలా దాచావు

ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ

ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ
ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ

పిలిచి పిలిచినా పలుకరించినా పులకించదు కదా నీ ఎదా
ఉసురొసుమనినా గుసగుసమనినా ఊగదేమది నీ మది
నిదుర రాని నిశిరాతురులెన్నో నిట్టూరుపులెన్నో
నోరులేని ఆవేదనలెన్నో ఆరాటములెన్నో
ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ
ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ

తలుపులు తెరుచుకొని వాకిటనే నిలబడతారా ఎవరైనా
తెరిచి ఉందనీ వాకిటి తలుపు చొరబడతారా ఎవరైనా
దొరవో మరి దొంగవో దొరవో మరి దొంగవో
దొరికావు ఈనాటికీ
దొంగను కానూ దొరనూ కానూ
దొంగను కానూ దొరనూ కానూ నంగనాచినసలే కానూ
ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం ఇన్నాళ్ళూ ఇన్నేళ్ళూ

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips