01 November 2011

ఈ రోజు మంచి రోజు

ఆ ఆ ఆ ఆ ఆ ఈ రోజు మంచి రోజు
మరపురానిది మధురమైనది
మంచితనం ఉదయించినరోజు

ఆ ఆ ఆ ఆ ఈ రోజు మంచి రోజు
మరపురానిది మధురమైనది
ప్రేమ సుమం వికసించినరోజు

తొలిసారి ధృవతార దీపించెను
ఆ కిరణాలే లోకాన వ్యాపించెను
ఆ ఆ ఆ ఆ తొలి ప్రేమ హృదయాన పులకించెను
అది ఆనంద దీపాలు వెలిగించెను

చెలికాంతులలో సుఖశాంతులతో
జీవనమే పావనమీనాడు
ఈ రోజు మంచి రోజు
మధురమైనది మరపురానిది
ప్రేమ సుమం వికసించినరోజు

రెండు నదుల సంగమమే అతిపవిత్రము
మతములన్ని ఒకటైతే మానవత్వము
రెండు నదుల సంగమమే అతిపవిత్రము
మతములన్ని ఒకటైతే మానవత్వము

మనసు మనసు లొకరికొకరు తెలిపే రోజు
తీరని కోరికలన్నీ తీరే రోజు
అనురాగాలు అభినందనలు
అందించే శుభసమయం నేడు

ఈ రోజు మంచి రోజు
మధురమైనది మరపురానిది
మంచితనం ఉదయించినరోజు
ప్రేమ సుమం వికసించినరోజు
మంచితనం ఉదయించినరోజు
ప్రేమ సుమం వికసించినరోజు
మంచితనమం ఉదయించినరోజు
ప్రేమ సుమం వికసించినరోజు

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips