మ్రోగింది కళ్యాణ వీణ..
మ్రోగింది కళ్యాణ వీణ..
నవ మోహన జీవన మధువనిలోన
మ్రోగింది కళ్యాణ వీణ..
మ్రోగింది కళ్యాణ వీణ..
నవ మోహన జీవన మధువనిలోన
మ్రోగింది కళ్యాణ వీణ..
మ్రోగింది కళ్యాణ వీణ..
పిల్ల గాలితో నేనందించిన పిలుపులే విన్నావో ..
నీలి మబ్బుపై నే లిఖియించిన లేఖలందుకున్నవో ..
ఆ లేఖలే వివరించగా .. రస రేఖలే ఉదయించగా ..
ఆ లేఖలే వివరించగా .. రస రేఖలే ఉదయించగా ..
కల వరించి కలవరించి
పులకిత తనులత నిను చేరుకోగా ..
మ్రోగింది కళ్యాణ వీణ..
మ్రోగింది కళ్యాణ వీణ..
మత కోయిలలు ముత్తైదువులై మంగళ గీతాలు పాడగా ..
మయూరాంగనలు ఆట వేలదులై.. లయ లహరుల పై ఆడగా ..
నా యోగమే ఫలియించగా ..
ఆ దైవమే కరుణించగా ..
నా యోగమే ఫలియించగా ..
ఆ దైవమే కరుణించగా ..
సుమసరుడే పురోహితుడై ..సుమసరుడే పురోహితుడై ..
శుభ ముహూర్తమే నిర్ణయించగా ..
మ్రోగింది కళ్యాణ వీణ..
మ్రోగింది కళ్యాణ వీణ..
నవ మోహన జీవన మధువనిలోన
మ్రోగింది కళ్యాణ వీణ..
మ్రోగింది కళ్యాణ వీణ..
No comments:
Post a Comment