01 September 2010

హొ ఒహొ ఒహొ బుల్లి పావురమా

హొ ఒహొ ఒహొ బుల్లి పావురమా
అయ్యో పాపం అంటే అది నేరమా
అతివలకింత పంతమా ఓ ఓ ఓ ...
అలకలు వారి సొంతమా

ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా
పదే పదే అదే వెటకారమా
అతివలు అంత సులభమా ఓ ఓ ఓ ...
శృతి ఇక మించనీకుమా


మాటే వినకుంటే బయటే పడుకుంటే
మంచే పడునంట మంచే చెబుతుంట
అమ్మో మగవారు అన్నిట తగువారు
హద్దే మరిచేరు చాలిక ఆ జోరు
కోపం తీరాలంట తాపం తగ్గాలంట
తాపం తగ్గాలంటే చొరవే మానాలంట
మాటా మంతీ మర్యాదే అపచారమా


ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా
పదే పదే అదే వెటకారమా
అతివలకింత పంతమా ఓ ఓ ఓ ...
అలకలు వారి సొంతమా


నెయ్యం తీయ్యంగ చెయ్యగ రమ్మంట
వియ్యాల పందిట్లొ కయ్యం తగదంట
గిల్లి కజ్జాలే చెల్లవు పొమ్మంట
అల్లరి చాలిస్తే ఎంతొ మేలంట
వెండి వెన్నెలంతా ఎండగా మరిందంట
కొంటె కుర్రాళ్ళకు అదియే సరియంట
తగని తెగని తగువంతా తన నైజమా


ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా
అయ్యో పాపం అంటే అది నేరమా
అతివలకింత పంతమా ఓ ఓ ఓ ...
అలకలు వారి సొంతమా


ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా
పదే పదే అదే వెటకారమా
అతివలు అంత సులభమా ఓ ఓ ఓ ...
శృతి ఇక మించనీకుమా

ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా
ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips