05 September 2010

ముందు తెలిసెనా ప్రభూ

ముందు తెలిసెనా ప్రభూ
ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు
మధుర క్షణమేదో.. కాస్త

||ముందు తెలిసెనా||

అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే !!2!!
సుందర మందార కుంద సుమదళములు పరువనా !!2!!
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును

||ముందు తెలిసెనా||


బ్రతుకంతా ఎదురు చూచు పట్టున రానే రావు !!2!!
ఎదుర రయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు !!2!!
కదలనీక నిముసము నను వదలి పోక నిలుపగ
నీ పదముల బంధింపలేను హౄదయము సంకెల చేసి

||ముందు తెలిసెనా||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips