10 September 2010

అగడాలు పగడాలు ఆలుమగల జగడాలు

అగడాలు పగడాలు ఆలుమగల జగడాలు
కోపాలు తాపాలు లేనిపోని పంతాలు
ఒక్కసారి సారి చెప్తే మళ్ళీ అంతా మాములు
ఒక్కసారి సారి చెప్తే మళ్ళీ అంతా మాములు
అగడాలు పగడాలు ఆలుమగల జగడాలు
కోపాలు తాపాలు లేనిపోని పంతాలు

భార్య వేచి ఉండటాలు....... మొగుడు రాకపోవటాలు
కోపగించు కోవడాలు....... కారణాలు చెప్పడాలు
గొంతు చించు కోవడాలు....... సమర్ధించు కోవడాలు
గొడవపెంచుకోవడాలు....... గోలచేసుకోవడాలు
అరవడాలు ఉరమడాలు.......కసరడాలు విసరడాలు
చిలికి చిలికి గాలి వానలవడాలు
వాయుగుండం పడడాలు....... కొంపగుండమవ్వడాలు
తెల్లవారు ఝామునే తీరాన్ని దాటడాలు
సారిలు చెప్పడాలు సరె అనుకోవడాలు
అసలేమి జరగనట్టు తెల్లారి పోవడాలు

ఫోను ఏదో రావటాలు...... నవ్వుతు మాటాడడాలు
అనుమానం రావడాలు... పెనుభూతమవ్వడాలు
ఆరాలే తియ్యడాలు..... కారాలే నూరడాలు
ఏనాటివొ తవ్వడాలు.... ఏకరువులు పెట్టడాలు
తిట్టడాలు...... నెట్టడాలు...... ఒకరినొకరు కొట్టడాలు
రోజు రోజు మాటలాగిపోవడాలు
తిక్క తిక్క గుండటాలు..... పక్క బందు చెయ్యడాలు
బ్రమ్హచర్య ముండటాలు..... మన్మధుణ్ణి తిట్టడాలు
సారిలు చెప్పడాలు..... చల్లబడి పోవడాలు
ఒకరికొకరు వంగడాలు పొంగి పొర్లి పోవడాలు

చీర మార్చుకోవటాలు..... తెమలకుండ పోవడాలు
మొగుడు మొత్తుకోవడాలు........టైము దాటి పోవడాలు
ట్రైను వెళ్ళి పోవడాలు....... రోడ్డుమీదె ఎగరడాలు
తెల్లముఖం వెయ్యడాలు...... ఇంటిముఖం పట్టడాలు
గంట సేపు దెప్పడాలు.... కంటి నీరు కార్చడాలు
అలగడాలు... తలగడాలు...... తడవడాలు
అర్ధరాత్రి దాటడాలు...... భద్రకాళి అవ్వడాలు
నిద్రమాను కోవడాలు...... నిప్పులెగజిమ్మడాలు
సారిలు చెప్పడాలు..... సర్దుకొని పోవడాలు
గుద్దులాట నవ్వులాటై ముద్దులాడుకోవటాలు

అగడాలు పగడాలు ఆలుమగల జగడాలు......... I am Sorry
కోపాలు తాపాలు లేనిపోని పంతాలు
ఒక్కసారి సారి చెప్తే మళ్ళి అంతా మాములు
I am Sorry I am Sorry I am Sorry Sorry Sorry
ఒక్కసారి సారి చెప్తే మళ్ళి అంతా మాములు I am So Sorry

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips