19 September 2010

సీతాకోక చిలకలా ఇవి తొలకరి దాహాలా

సీతాకోక చిలకలా ఇవి తొలకరి దాహాలా
మల్లె జాజి మకరందాలే హాయ్ హాయ్ హాయ్
నీతో నాకే వలపులా సిరి సొగసరి మోహాలా
చుమ్మా కోరే సుమగంధాలే హోయ్ హోయ్ హోయ్
వచ్చే వానజల్లు నన్ను గిచ్చే రమ్మని
నచ్చే నిన్ను నాకే ఇచ్చె జోడీ కమ్మని
పూసే పూలనడిగా గుమ్మ తేనె తెమ్మని
వాలే తుమ్మెదల్లే వచ్చి పోవా ఝుమ్మనీ
సీతాకోక చిలకలా ఇవి తొలకరి దాహాలా
మల్లె జాజి మకరందాలే హాయ్ హాయ్ హాయ్
నీతో నాకే వలపులా సిరి సొగసరి మోహాలా
చుమ్మా కోరే సుమగంధాలే హోయ్ హోయ్ హోయ్

కంటికి నిదరే రాకముందే తుంటరి కలలో చూసుకుంటా నిన్నే
ఒంటిగ రగిలే వయసులోన జంటను వెతికే కౌగిళింత నేనే
పరువాన రేగినా జడివాన ఆగునా
గొడవేల యాతన ఒడిలోకి చేరనా
హ హా హ హా

సీతాకోక చిలకలా ఇవి తొలకరి దాహాలా
మల్లె జాజి మకరందాలే హాయ్ హాయ్ హాయ్
నీతో నాకే వలపులా సిరి సొగసరి మోహాలా
చుమ్మా కోరే సుమగంధాలే హోయ్ హోయ్ హోయ్

ఈదురు గాలి ఈడకొస్తే వెన్నెల కాస్త ఏడిపిస్తే వానా
కిన్నెరసాని కిలుకుమంటే కన్నెల రాశి కులుకుతుంటే వీణా
విరజాజి సందులో విరివాన చిందులో
పొరపాటు పొందులో తెరచాటు విందులు
హ హా హ హా

నీతో నాకే వలపులా సిరి సొగసరి మోహాలా
చుమ్మా కోరే సుమగంధాలే హోయ్ హోయ్ హోయ్
సీతాకోక చిలకలా ఇవి తొలకరి దాహాలా
మల్లె జాజి మకరందాలే హాయ్ హాయ్ హాయ్
వచ్చే వానజల్లు నన్ను గిచ్చే రమ్మని
నచ్చే నిన్ను నాకే ఇచ్చె జోడీ కమ్మని
పూసే పూలనడిగా గుమ్మ తేనె తెమ్మని
వాలే తుమ్మెదల్లే వచ్చి పోవా ఝుమ్మనీ

No comments: