10 September 2010

లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు

లోకాలే గెలవగ నిలిచిన స్నేహాల విలువలు తెలిసేన ఈ ప్రేమ సరిగమ నువ్వేగా
కాలాన్నే కదలక నిలిపిన ఆకాశం భూమిని కలిపిన ఏదైనా వెనకన నువ్వేగా
ఎన్నెన్నో వరములు కురిసిన గుండెల్లో వలపై యెగసిన ఈ ఆనందం నీ చిరునవ్వేగా
నీతోనే కలిసిన క్షణమున నీలోని అణువణువణువున నీవె నీవె నీవె నీవుగా

యీ పూవ్వు కోరిందిరా ప్రేమాభిషేకాలనే
నా చూపు పంపిందిలే పన్నీటి మేఘాలనే
బుగ్గపై చిరు చుక్కవై జుట్టువై సిరిబొట్టువై నాతోనే నువ్వుండిపో
ఊపిరై యద చిలిపినై ఊపునై కనుచూపునై నీలోనే నేనుంటినే
నీ రామ చిలకను నేనై నా రామచంద్రుడు నీవై
కలిసి ఉంటె అంతే చాలురా

ఈ రాధ బౄందావనం సుస్వాగతం అందిరా
నా ప్రేమ సిమ్హాసనం నీ గుండెలో ఉన్నదే
పక్కగా రారమ్మని కమ్మగా ముద్దిమ్మనీ ఎన్నాళ్ళు కోరాలి రా
ఎప్పుడు కనురెప్పలా చప్పుడై యదలోపల ఉంటూనె ఉన్నానుగా
సన్నాయి స్వరముల మధురిమ పున్నాగ పువ్వుల ఘుమ ఘుమ
అన్ని నీవై నన్నే చేర రా

3 comments:

భాస్కర రామిరెడ్డి said...

keerthika karlapudi గారూ...,విఘ్నాధిపతిని భక్తితో పూజిద్దాం

హారం

Deepu said...

Keerthika Garu nice one..Mirchi songs unnaya...

Deepu said...

Nice one.. Keerthika garu, Mirchi songs unnaya meedhagara