22 September 2010

అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా

అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా
అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా

అవుననుకో గోరువంకా అలుసిచ్చాను కనుక
జరిగింది తెలుసుకోక నాపై నింద లేయక
నీకేమీ ఊసుపోక నాదే నేరమనక
నిజమంతే వాదించక ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా

ఓ కన్ను మూసి చూస్తున్నట్టు ఉంది
నా ఒంటి నడక నాకే నచ్చకుంది
నాతోనే నాకు గొడవయ్యినట్టు వుంది
నా నుంచి నేనే వేరయ్యినట్టు వుంది
ఊరుకోలేను చేరుకోలేను మనసిలా ఎందుకుంది
మూగనేకాను మాటకాలేను ఎమిటవుతున్నది ఈ ఈ ఈ ఈ

అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా

నాతోట పువ్వే నాపై కోపమంటే
ఈ ప్రాణమింకా వున్నా లేనిదంతే
నాలోని సగమే నాకే దూరముంటే
ఏ సందడైనా మనసే నవ్వదంతే
చిలిపి జగడాన్ని పెంచుకున్నను నేస్తమా తప్పు నాదే
చెలిమి విరహాన చేదు చూసాను పంతమా ఆగవే ఏ ఏ ఏ

అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంకా
అడుగేసా ఉండలేక చాల్లె బెట్టు చెయ్యకా
నీకేమీ ఊసుపోక నాదే నేరమనక
నిజమంతే వాదించక ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

No comments: