05 September 2010

ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంటా

ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంటా
అప్సరలే పేరంటాళ్ళు దేవతలే పురోహితులంటా
దీవనలు ఇస్తారంటా

||ఆకాశ||

తళుకు బెళుకు నక్షత్రాలు తలంబ్రాలు తెస్తారంటా ||2||
మెరుపు తీగ తోరణాలు మెరిసి మురిసి పోయేనంటా
మరపు రాని... వేడుకలంటా

||ఆకాశ||

పిల్ల గాలి మేళ గాళ్ళు పెళ్ళి పాట పాడేరంటా ||2||
రాజహంస జంట చేరీ రత్న హారతిచ్చేరంటా
రాసకేళి...జరిపేరంటా...

||ఆకాశ||

వన్నె చిన్నెలా ఇంధ్ర ధనసు పై వెన్నెల పానుపు వేసేనంట ||2||
మబ్బులు తలుపులు మూసేనంటా....ఆ..ఆ...ఆ...
మబ్బులు తలుపులు మూసేనంటా..
మగువలు తొంగి చూసేరంటా
మనలను.. గేలి.. చేసేరంటా..

||ఆకాశ||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips