07 September 2010

ఏలుతుండ్రు ఏలుతుండ్రు చిల్లర నాకొడుకులు

ఏలుతుండ్రు ఏలుతుండ్రు చిల్లర నాకొడుకులు
పదవి కోసం పాకులాడె కంత్రి నేతలు
ప్రజలంటె గొర్రెలని అనుకునె కొందరెదవలు
తనవాల్లె ఎదగాలని అనుకొని పెట్టె చిచ్చులు
ఎవడైనా ఒక్కడైనా ఆపనే ఆపడా
నిగ్గదీసి తప్పు ఇదని చెప్పనే చెప్పడా
ఏలుతుండ్రు ఏలుతుండ్రు చిల్లర నాకొడుకులు
పదవి కోసం పాకులాడె కంత్రి నేతలు ఓ ఓ ఓ

సందుకో జండా పెట్టి మందికే మందు పోసి
వందలే పంచిపెట్టి నెత్తికే బొట్టుపెట్టి
సందుకో జండా పెట్టి మందికే మందు పోసి
వందలే పంచిపెట్టి నేటికి బొంద పెట్టి
అడ్డదారిలొ assembly లొ అడుగు పెట్టి
అయిదు ఏండ్లూ ఆరు కోట్ల జనం తోటి
ఎవడికి వాడు దోచుకుతింటు పంగనామాలు జనంకే పెట్టి
పబ్బమే గడుపుతుండ్రు
ఏలుతుండ్రు ఏలుతుండ్రు చిల్లర నాకొడుకులు
పదవి కోసం పాకులడె కంత్రి నేతలు

అర్థరాత్రి స్వతంత్రం మనకు ఏం నేర్పె నేస్తం
అడ్డగోలు రాజ్యాంగం తిరగరాసెంత మూర్ఖులు
అర్థరాత్రి స్వతంత్రం మనకు ఏం నేర్పె నేస్తం
అడ్డగోలు రాజ్యాంగం తిరగరాసెంత మూర్ఖులు
పుస్తకాల్లొ చదువుకున్న రాజ నీతి
చదలు పట్టి కంపుకొడుతు నేటికుంది
గాంది లేదు నెహ్రు రాడు
జనంలో నుంచి ఎవడో ఒకడు ఎదురు వెల్లక తప్పదు

ఏలుతుండ్రు ఏలుతుండ్రు చిల్లర నాకొడుకులు
పదవి కోసం పాకులాడె కంత్రి నేతలు
ప్రజలంటె గొర్రెలని అనుకునె కొందరెదవలు
తనవాల్లె ఎదగాలని అనుకొని పెట్టె చిచ్చులు
ఎవడైనా ఒక్కడైనా ఆపనే ఆపడా
నిగ్గదీసి తప్పు ఇదని చెప్పనే చెప్పడా
ఏలుతుండ్రు ఏలుతుండ్రు చిల్లర నాకొడుకులు
పదవి కోసం పాకులాడె కంత్రి నేతలు ఓ ఓ ఓ

No comments: