08 September 2010

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక

తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఒహూ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక

నాకోసమే తళుక్కన్నదో నా పేరునే పిలుస్తున్నదో
పూవానగా కురుస్తున్నది నా చూపులో మెరుస్తున్నది

యే వూరే అందమా ఆచూకి అందుమా
కవ్వించే చంద్రమా దోబూచీ చాలమ్మా

కులుకులొ ఆ మెలికెలు మెఘాలలో మెరుపులు
పలుకులు ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు
పదునులు ఆ చూపులు చురుకైన చుర కత్తులు
పరుగులు ఆ అడుగులు గోదారిలో వరదలు

నా గుండెలో అదోమాదిరి
నింపేయకే సుధామాధురి
నా కళ్ళలో కలల పందిరి
అల్లేయకోయి మహాపోకిరి

మబ్బులో దాగుంది తనవైపే లాగింది
సిగ్గల్లే తాకింది బుగ్గల్లో పాకింది

ఒహూ తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక

ఎవ్వరు నన్నడగరే అతగాడి రూపేంటని
అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వుని

మెరుపుని తొలి చినుకుని కలగలిపి చూడాలని
ఎవరికి అనిపించినా చూడొచ్చు నా చెలియని

ఎన్నాళిలా తనొస్తాడని చూడాలటా ప్రతి దారిని
యేతోటలో తనుందోనని యెటు పంపనూ నా మనసుని

ఏ నాడు ఇంతిదిగా కంగారే ఎరుగనుగా
అవునన్నా కాదన్నా గుండెలకు కుదురుందా

అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా
అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగి దాగకా

2 comments:

Shrik said...

Chaala Bagundhi, Thanks

deepu said...

Hello.. Thanks for giving lyrics.. Guess you are a singer..