25 September 2010

మీ నగుమోము నా కనులార కడ దాక కననిండు

మీ నగుమోము నా కనులార కడదాక కననిండు
మీ నగుమోము నా కనులార కడదాక కననిండు
ఈ సూత్రముతో ఈ కుంకుమతో నను కడతేరి పోనిండు
మీ నగుమోము నా కనులార కడ దాక కననిండు

ఉపచారలే చేసితినో ఎరగక అపచారాలే చేసితినో
ఉపచారలే చేసితినో ఎరగక అపచారాలే చేసితినో
ఒడి దుడుకులలో తోడై ఉంటిని మీ అడుగున అడుగై నడిసితిని
మీ నగుమోము నా కనులార కడదాక కననిండు

రెక్కలు వొచ్చి పిల్లలు వెళ్ళారు రెక్కలు అలిసి మీరున్నారు
రెక్కలు వొచ్చి పిల్లలు వెళ్ళారు రెక్కలు అలిసి మీరున్నారు
పండుటాకులము మిగిలితిమి పండుటాకులము మిగిలితిమి
ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి
మీ నగుమోము నా కనులార కడదాక కననిండు

ఏ నోములు నే నోచితినో ఈదేవుని పతిగా పొందితిని
ఏ నోములు నే నోచితినో ఈదేవుని పతిగా పొందితిని
ప్రతిజన్మ మీ సన్నిధిలోన ప్రమిదగ వెలిగే వరమడిగితిని
మీ నగుమోము నా కనులార కడదాక కననిండు
ఈ సూత్రముతో ఈ కుంకుమతో నను కడతేరి పోనిండు
మీ నగుమోము నా కనులార కడదాక కననిండు

No comments: