30 September 2010

మళ్ళి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా

మళ్ళి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా
తుళ్ళి పాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా ||2||
విధివరమే నీవేగా నీవేగా కల నిజమై పూచేగా పూచేగా
జిలిబిలి పలుకుల నువ్వా దివి లో తారా జువ్వా
జిలిబిలి పలుకుల నువ్వా దివి లో తారా జువ్వా జువ్వా జువ్వా..

|| మళ్ళి ||

సిరి సిరి మువ్వల చిరు సడి వింటే స్మృతి పధమున నీ గానమె ||2||
పొంగి పారె యేటి లొ తొంగి తొంగి చూస్తె తోచెను ప్రియ నీ రూపమె
సొకేటీ పవనం నువ్వు మురిపించే గగనం
కోనేటి కమలం లోలోని అరళం
కలత నిదురలో కలలాగ జారిపోకె నువు జవరాల
నీలి సంద్రమున అల లాగ హృదయ లోగిలిలొ నువ్వా
మువ్వా మువ్వా మువ్వా.

|| మళ్ళి ||

తీయనైన వూసుతో ప్రియ విరహము తో క్రుంగెను యెద నీ కోసమె ||2||
సాగిపోయె దారిలొ వేసే ప్రతి అడుగులొ తగిలెను నీ మృదు పాదమె
ఎగిసేటి కెరటం చేరే లే తీరం
చీకటిలో పయనం నువ్వేలే అరుణం
వలపు వరదలో నది లాగ తడిపి పో జడి వానలా
మంచు తెర ల లో తడి లాగ నయన చిత్తడి లొ నువ్వా

|| మళ్ళి ||

No comments: