17 September 2010

చెలీ రావా...వరాలీవా...

ఆ..ఆ..ఆ...ఆ.అ.ఆ.అ.ఆ..ఆ..ఆ..అ
చెలీ రావా...వరాలీవా...
నినే కోరే... ఓ జాబిల్లి..
నీ జతకై వేచేనూ...నిలువెల్లా నీవే..

||చెలీ రావా||

ఈ వేదనా తాళ లేనే భామ చందమామ...
వెన్నెల్లనే పూలు రువ్వే చూడు ఊసులాడు...
చెప్పాలని నీతో ఎదో చిన్న మాటా...
చెయ్యాలని స్నేహం నీతో పూట పూట..
ఊ అంటే నీ నోటా బ్రతుకే వెన్నెల కోటా...

||చెలీ రావా||

వయ్యారాల నీలినింగీ పాడే కధలు పాడే...
ఉయ్యాలగా చల్ల గాలి ఆడే చిందులాడే...
సుగంధాల ప్రేమా అందించగా రాదా..
సుతారాల మాట చిందించగా రాదా
ఆకాశం పగ ఐతే మేఘం కదలాడేనా..

||చెలీ రావా||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips