31 December 2010

చూస్తా బాగా చూస్తా చేయి చూస్తా చూసి చెబుతా

చూస్తా బాగా చూస్తా చేయి చూస్తా చూసి చెబుతా
ముందు వెనుకా యేముందో యెక్కడుందో
యెవరికెవరి కెంతుందో చూచి చెబుతా
కోట్లు కోట్లుగా గడించి కూడబెట్టకు ||చూస్తా||

వజ్రాలుగా బంగారుగా మార్పి దాచకు
రాజ్యాంగమందు నేడు రాహువున్నాడు
రాత్రిరాత్రి కొచ్చి మొత్తం మింగిపోతాడు
ఏఎన్ఆర్ ఎన్‌టిఆర్ ఏలుతారన్నారు
వాణిశ్రీ సావిత్రికి వారసని చెప్పాను
జగ్గయ్య జయలలిత శోభన్‌బాబు కృష్ణకి
పద్మనాభం రామాప్రభ రాజబాబుకి
దసరా బుల్లోడికి ప్రేమనగర్ నాయుడికి
ఆత్రేయ ఆదుర్తి మహదేవన్ అందరికి
ఆనాడు చెప్పింది ఈనాడు జరుగుతూంది
ఈనాడు చెప్పేది రేపు జరుగబోతుంది ||చూస్తా||

వేలవేల యెకరాలకు గోలుమాలు
తాతల యెస్టేటుకైన చెప్పాలి టాటాలు
దిగమింగే నాయకులకు దినగండాలు
పన్నెగవేసే పెద్దలకు వెలక్కాయలు
తాతయ్య పేరులో మనవళ్ళు పెరిగారు
మనవళ్ళు దోచింది మునిమనవళ్ళడిగారు
అడుగునున్న వాళ్ళింక అణిగిమణిగి వుండరు
ఆడోళ్ళే ఇక మీదట అందలాన ఉంటారు
మగవాళ్ళ ఆటకట్టి మరమ్మత్తు చేస్తారు
అందుకే చిట్టి నిర్మల చేతిలో సేటు రాత రాశాడు
ఓ పండిట్ జీమేరా హాథ్ భీ దేఖియేనా దేకుతా దేకుతా
ఈనాడు చెప్పేది రేపు జరగబోతుంది
ఏమోలే అనుకుంటే మీ ఖర్మలే పొండి ||చూస్తా||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips