31 December 2010

దేవత నీవే నా దేవత నీవే

దేవత నీవే నా దేవత నీవే
కనుపాపగ కాస్త నినునే రిబ్బనై
నా జత నీవే ఇక నా కత నీవే ఎడ బాయక ఉంటా తోడు నీడనై
నీలో నేను సగములే నీవే నాకు జగములే
నీతో యుగమే క్షణములే ఇది మన మనసుకు కలయిక ||దేవత నీవే||

చినుకై వచ్చే నీకోసం పుడమై పోతాను
నదిలా వచ్చే నీకోసం కడవై పోతాను
కలలా వచ్చే నీకోసం కన్నై పోతాను
పులిలా నన్ను తాకా ఓ సింహానవుతాను
నీ ఊపిరితో ఋమెదురైనా వేణువుకాగా
నీ చూపులతో ఈ వేసవిలో వెన్నెలరాగా
సూర్యుని చుట్టూ భూమిలా నీ చుట్టూనే తిరగనా
నీవేనేనై బతకనా తలపుల తలపులు తెరిచినా ||దేవత నీవే||

జోరున కురిసే వానలు ఎండే నువ్వంట
దిక్కులు చెరిగే ఎండలు వానే నువ్వంట
ఏకాంతాన్ని వెలివేసేతోడే నువ్వంట
శోకాలన్నీ తరిమేసే జాడే నువ్వంట
నీ నవ్వుల్లో పూచేటి పువ్వైపోనా
నీ నడకల్లో మోగేటి మువ్వైపోనా
గుడిలో వెలసిన రూపము గుండెన వెలిగే దీపము
పంచే తీయని పాపము వలపుల పిలుపులు తెలిపెను ||దేవత నీవే||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips