22 December 2010

ప్రియా ప్రియతమా రాగాలు

ప్రియా ప్రియతమా రాగాలు
సఖి కుశలమా అందాలు
ప్రియా ప్రియతమా రాగాలు
సఖి కుశలమా అందాలు

నీ లయ పంచుకుంటుంటే
నా శృతి మించిపోతుంటే నాలో రేగే

ప్రియా ప్రియతమా రాగాలు
సఖి కుశలమా అందాలు
ప్రియా ప్రియతమా రాగాలు
సఖి కుశలమా అందాలు

జగాలులేని సీమలో యుగాలు దాటే ప్రేమలు
పెదాల మూగ పాటలో పదాలు పాడే ఆశలు
ఎవరులేని మనసులో ఎదురురావే నా చెలి
అడుగుజారే వయసులో అడిగి చూడు కౌగిలి
ఒకే వసంతం కుహూ నినాదం
నీలో నాలో పలికే

ప్రియా ప్రియతమా రాగాలు
సఖి కుశలమా అందాలు

నీ లయ పంచుకుంటుంటే
నా శృతి మించిపోతుంటే నాలో రేగే

ప్రియా ప్రియతమా రాగాలు
సఖి కుశలమా అందాలు

శరత్తులోన వెన్నెల తలెత్తుకుంది కన్నుల
షికారు చేసే కోకిల పుకారు వేసే కాకిలా
ఎవరు ఎంత వగచిన చిగురువేసే కోరిక
నింగి తానే విడిచిన ఇలకు రాదు తారక
మదే ప్రపంచం విధే విలాసం
నిన్ను నన్ను కలిపే

ప్రియా ప్రియతమా రాగాలు
సఖి కుశలమా అందాలు
ప్రియా ప్రియతమా రాగాలు
సఖి కుశలమా అందాలు

నీ లయ పంచుకుంటుంటే
నా శృతి మించిపోతుంటే నాలో రేగే

ప్రియా ప్రియతమా రాగాలు
సఖి కుశలమా అందాలు

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips