05 December 2010

ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో

ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం

ఒక దేవత గుడిలో ఒక దేవుని ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం

మరులుపూచిన పూలపందిరిలో
మమతలల్లిన ప్రేమ సుందరికీ
పట్టాభిషేకం పట్టాభిషేకం
మనసు విరిసినా మనసు మరువనీ
మధుర జీవిత మానవమూర్తికి
మంత్రాభిషేకం మంత్రాభిషేకం

రాగాల సిగలో అనురాగాల గుడిలో
భావాలబడిలో అనుభవాల ఒడిలో
వెలసిన రాగదేవతా రాగాభిషేకం
వెలసినప్రేమ విజేతా ప్రేమాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం

ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం

ఒక దేవత గుడిలో ఒక దేవుని ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం

కలలచాటున పెళ్ళిపల్లకిలో
కదలివచ్చిన పెళ్ళికూతురికీ
పుష్పాభిషేకం పుష్పాభిషేకం
పాట మారినా పల్లవి మార్చనీ
ప్రణయలోకపు ప్రేమమూర్తికి
స్వర్ణాభిషేకం స్వర్ణాభిషేకం


స్వప్నాల నింగిలో స్వర్గాల బాటలో
బంగారు తోటలో రతనాల కొమ్మకు
విరిసిన స్వప్న సుందరీ క్షీరాభిషేకం
కొలిచినప్రేమ పూజారీ అమౄతాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం

ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం

No comments: