05 December 2010

సూర్యకిరీటమే నీవా,చంద్రసుమానివే నీవా

సూర్యకిరీటమే నీవా,చంద్రసుమానివే నీవా
మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో
తొలకరి మేఘ ఛాయలో మెరిసిన తారవో
వాత్సాయన వన వాసినీ కావేరీ
సూర్యకిరీటమే నీవా,చంద్రసుమానివే నీవా
మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో
తొలకరి మేఘ ఛాయలో మెరిసిన తారవో
వాత్సాయన వన వాసినీ కావేరీ

పెదవి తాకి స్వాతిముత్యం పగడమయ్యిందా
తనువు తాకి శ్వేతపుష్పం అరుణమయ్యిందా
నీ ఒడి మన్మధ యాగ సీమ
నీ సరి ఎవ్వరు లేరె భామ
నీతోనే పుట్టింది ప్రేమ

కణ్వ శకుంతలే నీవా,కావ్య సుమానివే నీవా
చల్లని వెన్నెల హాయిని వివరించేదెలా
వెచ్చని ఊహల వీణని వినిపించేదెలా
వాత్సాయన వన వాసినీ కావేరీ
సూర్యకిరీటమే నీవా,చంద్రసుమానివే నీవా

సొగసు భారమోపలేక నడుము చిక్కిందా
జాలిగొన్న జాణతనమే జఘనమయ్యిందా
తుమ్మెద ఎరుగని తేనె పువ్వా
సౌందర్యానికి తావి నువ్వా
ప్రియమార దరిచేర రావా

సూర్యకిరీటమే నీవా,చంద్రసుమానివే నీవా
మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో
తొలకరి మేఘ ఛాయలో మెరిసిన తారవో
వాత్సాయన వన వాసినీ కావేరీ

No comments: