05 December 2010

వన్నెకాడా ఓ వన్నెకాడా

వన్నెకాడా ఓ వన్నెకాడా
నిన్ను చూచి నా మేను పులకించెరా
ఓ వీరా నన్నేలి కులికించరా
ఓ వన్నెకాడా నిన్ను చూచి నా మేను పులకించెరా
ఓ వీరా నన్నేలి కులికించరా

మరులు పెంచే మంచిగంధం మల్లెపూపానుపు వేచేనోయి
మరులు పెంచే మంచిగంధం మల్లెపూపానుపు వేచేనోయి
నీ దయకోరి నిలిచేనోయి
ఓ వన్నెకాడా నిన్ను చూచి నా మేను పులకించెరా
ఓ వీరా నన్నేలి కులికించరా

ఉరుకుల పరుగుల దొర మగసిరి కిరి తగదురా
ఉరుకుల పరుగుల దొర ఈ మగసిరి కిరి తగదురా
ఆ ఆ ఆ ఆ ఉరుకుల పరుగుల దొర

చూడరా ఇటు చూడరా సరి ఈడుజోడు వన్నెలాడినేరా
చూడరా ఇటు చూడరా సరి ఈడుజోడు వన్నెలాడినేరా
వలపు గొలిపే బింకాల కలల కలిపే పొంకాల వదలిపోబోకురా
ఉరుకుల పరుగుల దొర ఈ మగసిరి కిరి తగదురా
ఆ ఆ ఆ ఆ ఉరుకుల పరుగుల దొర

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తాళలేరా మదనా
మదనా మదనా మదనా నే తాళలేరా మదనా
మదనా మదనా మదనా నే తాళలేరా మదనా

విరుల సరాల వేగితి చాలా విరహమోర్వజాల
విరుల సరాల వేగితి చాలా విరహమోర్వజాల
ఇలలో లేని అమరసుఖాల తేలజేతు వేగ ఎదనుగతి
తాళలేరా మదనా
మదనా మదనా మదనా నే తాళలేరా మదనా
మదనా మదనా మదనా నే తాళలేరా మదనా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips