31 December 2010

బొంబాయి బొమ్మ సూడరా దీని సిగతరగా

బొంబాయి బొమ్మ సూడరా దీని సిగతరగా
మన ఇంట్లో అడుగుపెట్టరా
బుజ్జాయి పెళ్ళి పనుల్లో దీని సిగతరగా అర్జెంటుగా
నడుం కట్టెరో ||బొంబాయి||

సామియానా పరిచేస్తా పూలమైనా పిలిపిస్తా
పిండివంటలు గుమాగుమా చేయిస్తా
వేల టపాసుల ఢమాఢమా పేలుస్తా
ఇల్లేపీకి పందిరి వేస్తా ఉడతా భక్తీ సాయం చేస్తా
బజ్జుంటే పనులు జరగవోయ్ నీ సిగతరగా
బాజాలకు కబురుపెట్టవోయ్
ఇంతకు నువ్వు ఎవరితాలూకోయ్ నీసిగతరగా
మాపైనే జులుం ఏమిటోయ్

స్టైలు చెంపకు చుక్కెడతా నగలూ నట్రా తగిలిస్తాం
దగ్గరుండీ తలంబ్రాలే పోస్తాం
లగ్గంలోని తతంగమే చేస్తాం
అడుగులు ఏడు నడిపించేస్తాం పెళ్ళే నాదని భావించేస్తా
చాకంటీ చురుకు నీదిరోయ్ నీసిగతరగా
నీకెంతా చొరవ ఉందిరోయ్
ఈ పెళ్ళికి పెద్దనువ్వురోయ్ నీ సిగతరగా
నీపెళ్ళాం లక్కీ పిల్లరోయ్

No comments: