31 December 2010

వేసవి కాలం వెన్నెలాగా వానల్లో వాగుల్లాగ వయసు ఎవరికోసం

వేసవి కాలం వెన్నెలాగా వానల్లో వాగుల్లాగ వయసు ఎవరికోసం
ఓం ధిరి ఓం ధిరి ఓం ధిరి ధిరి ధిరి ధిరి ధిరి
శీతాకాలం ఎండల్లాగ సంక్రాంతి పండుగలాగ సొగసు ఎవరికోసం ||ఓంధిరి||
ఓరోరి అందగాడా నన్నేలు మన్మధుడా నీకోసం నీకోసం నీ కోసం
నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి
నే పండుగ చేసే సందడిలోన ఆకు వక్కా సున్నం నీ కోసం

గుండె చాటుగా ఉండనందిక ఇన్నినాళ్లు దాచుకున్న కోరికా
ఉన్న పాటుగా ఆడపుట్టుకా కట్టుబాటు దాట లేదుగా
కన్నె వేడుకా విన్నవించగా అందుబాటులోనె ఉన్నానుగా
తీగచాటుగా, మూగపాటగా ఆగిపోకే రాగమాలికా
నిలువెల్ల నీ జతలోన చిగురించు లతనైరానా
కొనగోటి కొంటెతనాన నిను మీటనా చెలివీణా
అమ్మమ్మో అబ్బబ్బో ఆముచ్చట తీరంగా నీ మెళ్లో హారంగా
నా రేకులు విచ్చేసోకులు తెచ్చి అందిస్తున్నా మొత్తం నీకోసం

సిగ్గుకోరికా నెగ్గలేవుగా ఏడుమల్లెలెత్తు సుకుమారమా
సాయమీయక మొయలేవుగా లేత సోయగాల భారమా
కౌగిలింతగా స్వాగతించగా కోరుకున్న కొంగు బంగారమా
తాళి బొట్టుగా కాలిమెట్టెగా చేరుకోవ ప్రేమ తీరమా
మునిపంటి ముద్దురకానా చిగురంటి పెదవులపైనా
నిద్దర్లో పొద్దుల్లో నీ వద్దకు నేనొచ్చి ఆ హద్దులు దాటించి
నువ్వొద్దనలేని పద్ధతిలోనే ముద్దులనెన్నో తెచ్చా నీ కోసం

No comments: