05 December 2010

అందమైన జీవితమూ అద్దాల సౌధము

అందమైన జీవితమూ అద్దాల సౌధము
చిన్న రాయి విసిరినా చెదరిపోవును
ఒక్క తప్పు చేసినా ముక్కలే మిగులును

అందమైన జీవితమూ అద్దాల సౌధము
చిన్న రాయి విసిరినా చెదరిపోవును
ఒక్క తప్పు చేసినా ముక్కలే మిగులును
అందమైన జీవితమూ అద్దాల సౌధము

నిప్పు వంటి వాడవు తప్పు చేసినావు
ఎంత తప్పు చేసినావు
క్షణికమైన ఆవేశము మనుసునే చంపింది
నిన్ను పసువుగా మార్చింది

నీ పడచుదనం దుడుకుతనం పంతాలకు పోయింది
పచ్చనైన నీ బ్రతుకును పాతాళానికి లాగింది
నిన్ను బలిపసువుగా మార్చింది
అందమైన జీవితమూ అద్దాల సౌధము

ఎవరిది ఈ నేరమని ఎంచి చూడదూ లోకం ఎంచి చూడదూ
ఏదో పొరపాటని మన్నిచదూ నిన్ను మన్నిచదూ

అరిటాకు వంటిదే ఆడదాని శీలమూ
అరిటాకు వంటిదే ఆడదాని శీలమూ
ముల్లు వచ్చి వాలినా తాను కాలు జారినా
ముప్పు తనకే తప్పదు ముందు బ్రతుకే ఉండదూ

ఛిన్న రాయి విసిరినా చెదరిపోవునూ
ఒక్క తప్పు చేసినా ముక్కలే మిగులును
అందమైన జీవితమూ అద్దాల సౌధము

No comments: