05 December 2010

ఏలేలమ్మ ఏలేలమ్మ ఏలేలమ్మ హొయ్

ఏలేలమ్మ ఏలేలమ్మ ఏలేలమ్మ హొయ్
ఏలేలమ్మ ఏలేలమ్మ ఏలేలమ్మ హొయ్
అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేను
అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేను
రతి నీవే శశి నీవే సుధ నీవే దేవి
నీ తలపే నీ పిలుపే నీ వలపే నావి
అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేను

గాలుల గారాలే చెలి కులుకున నిలిపినది
మెరుపుల మిసమిసలె మేఘలకు తెలిపినది
ముద్దు మోములో కొటి మోహములు చిలికేను నా చెలి కనులే
సింధు భైరవిని చిలక పలుకుల దోర పెదవులే పలికే
ప్రేమ యువకుల పాలిట ఒక వరం
అది వలచిన మనసుల అభినయం
ప్రేమ యువకుల పాలిట ఒక వరం
అది వలచిన మనసుల అభినయం
లాలాలల లాలాలల లాలాలల లాలాలల
అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేను

అప్సరా ఆడెనే అందలే మ్రోగెనే
అరులు విరిసి పలకరించె మనసు
కలలు మురిసి పులకరించె వయసు
కన్నులు కులికెను కవితలు పలికెను
పాదము కదిలెను భావము తెలిసెను
అదే కదా అనుక్షణం చెరగని
సల్లాపమే ఉల్లాసమే ఆ నగవు
మోహము కొనసాగే తొలి మోజులు చెలరేగే
నా పాటకు పల్లవిలా చెలి పొంగెను వెల్లువలా
అమరవాణి ఇది అందాల గని ఇది నవతరానికే ఆధారం
మధుర మధుర సుకుమార ప్రణయ రసలోక తరంగిణి చెలి స్నేహం ఆ ఆ
పలవరింతలు రేపెను పోటి ఆమె కెవరు లేరిక సాటి
పలవరింతలు రేపెను పోటి ఆమె కెవరు లేరిక సాటి
లాలాలల లాలాలల లాలాలల లాలాలల

అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేను
రతి నీవే శశి నీవే సుధ నీవే దేవి
నీ తలపే నీ పిలుపే నీ వలపే నావి
అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేను

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips