21 December 2010

ప్రేమతో చిలక మడుపు సేవలా(Sad Song)

ప్రేమతో చిలక మడుపు సేవలా
అంతలో మనసు విరుపు మాటలా
కాపురాలు గాలివాన గోపురాలా
పావురాలు మూగబోవు పంజరాలా
ప్రేమతో చిలక మడుపు సేవలా
అంతలో మనసు విరుపు మాటలా

నిప్పులేని ధూమమేదో గుప్పుమంది గుండేలో
పూలు తెచ్చి అల్లుతుంటే ముళ్ళతాకే దండలో
నిప్పులేని ధూమమేదో గుప్పుమంది గుండేలో
పూలు తెచ్చి అల్లుతుంటే ముళ్ళతాకే దండలో
సందేహమన్నదే నీడలా సాగెనే
సంసారమన్నదే మోడుగా మారునే
సందేహజ్వాలలే రేగుతున్న వేళలో
సందర్భమన్నదే అగ్నిలో ఆజ్యమా

ప్రేమతో చిలక మడుపు సేవలా
అంతలో మనసు విరుపు మాటలా

ఆరుమూర్ల చీరకట్టి ఆలినైన పాపమాb
మూడుముళ్ళు నీకువేసి ముట్టుకున్న నేరమా
ఆరుమూర్ల చీరకట్టి ఆలినైన పాపమా
మూడుముళ్ళు నీకువేసి ముట్టుకున్న నేరమా
పూలతో రాసిన కట్టెలాయే నా కథ
గంజినే తాగినా కల్లుగా మారేనా
రామపాదమేప్పుడూ రాతినైన తాకదా?
రాతల్లేన్ని మారిన రాతిగుండె మారదా!

ప్రేమతో చిలక మడుపు సేవలా
అంతలో మనసు విరుపు మాటలా
కాపురాలు గాలివాన గోపురాలా
పావురాలు మూగబోవు పంజరాలా
ప్రేమతో చిలక మడుపు సేవలా
అంతలో మనసు విరుపు మాటలా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips