31 December 2010

పెట్టిపుట్టిన దానవమ్మా నువ్వు నీ పుట్టుకే

పెట్టిపుట్టిన దానవమ్మా నువ్వు నీ పుట్టుకే ఒక పండుగమ్మా మాకు
ఎందరో నీలాంటి పాపలు పుట్టివుంటారు అందులో ఎందరమ్మ
పండుగలకు నోచుకుంటారు వుండి చూచుకుంటారు ||పెట్టిపుట్టిన||

కన్నవాళ్ళు చేసుకున్న పూజాఫలమో నువ్వేజన్మలోనో
దాచుకున్న పూర్వపుణ్యమో నూరు పండుగ లీలాగే చేసుకుంటావు
కొందరేమో పండుగల్లే వచ్చిపోతారు నూరేళ్ళూ నిండిపోతారు ||పెట్టిపుట్టిన||

ఉన్నవాళ్ళు లేనివాళ్ళను భేదాలు మనకెగాని మట్టిలోన
లేవమ్మా ఆ మట్టిలోనే పుట్టి గిట్టే తోబుట్టులకు
కన్నీటి బొట్టు కానుకిస్తే చాలమ్మా చాలమ్మా ||పెట్టి పుట్టిన||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips