05 December 2010

వయసే ఒకపూలతోట

వయసే ఒకపూలతోట
వలపే ఒక పూలబాట
ఆతోటలో ఆ బాటలో
పాడాలీ తీయని పాట ||2||

పాలబుగ్గలు ఎరుపైతే హో
లేతసిగ్గులు ఎదురైతే హో హో ||2||
పాలబుగ్గలు ఎరుపైతే ఆఆఆ
లేతసిగ్గులు ఎదురైతే
రెండు మనసులు ఒకటైతే
పండువెన్నెలతోడైతే ||2||
కోరికలే తీరెనులే
పండాలీ వలపుల పంటా ||2||

నీ కంటి కాటుక చీకటిలో
పగలు రేయిగ మారెనులే ||2||
నీ కొటెనవ్వుల కాంతులలో
రేయి పగలై పోయేనులే ||2||
నీ అందమూ నాకోసమే
నీ మాట ముద్దులమూటా ||2||

పొంగిపోయే పరువాలూ హో
నింగినంటె కెరటాలు ఆఆ ||2||
చేరుకొన్నవి తీరాలూ
లేవులే,,ఇక దూరాలూ ||2||
ఏనాటికీ మనమొక్కటే
ఒక మాటా ఇద్దరినోటా ||2||

వయసే ఒకపూలతోట
వలపే ఒక పూలబాట
ఆతోటలో ఆ బాటలో
పాడాలీ తీయని పాట ||2||

No comments: