05 December 2010

నాణ్యమైన సరుకుంది లాహిరి భలే నాణ్యమైన సరుకుంది

నాణ్యమైన సరుకుంది లాహిరి భలే నాణ్యమైన సరుకుంది లాహిరి
మీరు బోణీ చేసారంటే కోరుమిల్లి జాంగిరి
నాణ్యమైన సరుకుంది లాహిరి భలే నాణ్యమైన సరుకుంది లాహిరి

చంద్రలేఖ వాయలు జనకు జనకు పాయలుఔను ఔను ఔను
చంద్రలేఖ వాయలు జనకు జనకు పాయలు
బస్తీలో పేరు మోసిన భలేరాముడు చీరలు అహ భలేరాముడు చీరలు
నాణ్యమైన సరుకుంది లాహిరి భలే నాణ్యమైన సరుకుంది లాహిరి

మూట విప్పి చూపిస్తే మురిసి భ్రమసిపోతారుఔను ఔను ఔను
మూట విప్పి చూపిస్తే మురిసి భ్రమసిపోతారు
తల తాకట్టైన పెట్టి తప్పకుండా కొంటారుతప్పకుండా కొంటారు
చీనా సిల్కు,షిఫాన్ తల్కు,కన్ను చెదురు కంచిపట్టు ఓ ఓ ఓ ఓ ఓ
చీనా సిల్కు,షిఫాన్ తల్కు,కన్ను చెదురు కంచిపట్టు
అత్తాకోడలు అంచులు,పెద్దాపురం పంచెలు
నాణ్యమైన సరుకుంది లాహిరి భలే నాణ్యమైన సరుకుంది లాహిరి
హా బొంబాయి గుడ్డలు,రవికెల గుడ్డలు,చొక్కా గుడ్డలు,పరికిణి గుడ్డలు

లంగాలు,లుంగీలు,రంగురంగు ఓణీలు చెయ్యండి బోణీలుచెయ్యండి బోణీలు
అప్టుడేటు జాకెట్లు,అందమైన దుప్పట్లుఔను ఔను ఔను
ఇవి అప్టుడేటు జాకెట్లు,అందమైన దుప్పట్లు
కోటింగులు,షూటింగులు,కొత్త కొత్త ప్రింటింగులు ఓ ఓ ఓ ఓ ఓ
కోటింగులు,షూటింగులు,కొత్త కొత్త ప్రింటింగులు
ఒక్కసారి చెయ్యి పడితే వదలలేరు డీరింగులు,వదలలేరు డీరింగులు
నాణ్యమైన సరుకుంది లాహిరి భలే నాణ్యమైన సరుకుంది లాహిరి
హా బొంబాయి గుడ్డలు,రవికెల గుడ్డలు,చొక్కా గుడ్డలు,పరికిణి గుడ్డలు

మరులుపెట్టు అద్దకాలు,మంచి మంచి చీటీలు
వయసువాళ్ళు మెచ్చుకొనే వన్నె వన్నె చోళీలుఔను ఔను ఔను
కట్టుబడికి,పెట్టుబడికి చౌకగాను గిట్టుబడికి ఓ ఓ ఓ ఓ ఓ
అసలు ధరకే అమ్ముతాను,అమ్మతోడు నమ్మండిఅమ్మమ్మతోడు నమ్మండి

నాణ్యమైన సరుకుంది లాహిరి భలే నాణ్యమైన సరుకుంది లాహిరి
మీరు బోణీ చేసారంటే కోరుమిల్లి జాంగిరి
నాణ్యమైన సరుకుంది లాహిరి భలే నాణ్యమైన సరుకుంది లాహిరి
లాహిరి లాహిరి లాహిరి

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips