04 December 2010

ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు

ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు
ముద్దుల సీతతో ఈడనే మురిపాలాడినాడు

ఇది సీతమ్మ తల్లి ఆరేసుకున్న నార చీరె
ఇదె రాముడు కట్టుకొనగ పులకించిన పంచె
ఏడేడు లోకాలను ఏలెడి పాదాలివే
మాయల బంగారు లేడి మాయని గురుతులివే

పచ్చగ అయిదోతనమే పదికాలాలుండగా
సీతమ్మ వాడిన పసుపుకుంకుమ రాళ్ళివే
దాటొద్దని లక్ష్మణుడు గీతను గీసిన చోటిదే
అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవాళ్ళివే

ఇది ఆ రాముడు నడయాడిన పుణ్యభూమి
మరి నా రామునికీడ నిలువనీడ లేదిదేమి
నిలువ నీడ లేదిదేమి

No comments: