05 December 2010

బావా బావా పన్నీరు బావకు మరదలు బంగారు

బావా బావా పన్నీరు బావకు మరదలు బంగారు
బాజాలు మోగందే బాకాలు ఊదందే ఎందుకు కంగారు
బావా బావా పన్నీరు బావకు మరదలు బంగారు
బాజాలు మోగందే బాకాలు ఊదందే ఎందుకు కంగారు

చిలిపి చేష్టలతో వలపే కోరునట
ముద్దు తీర్చమని సద్దు చేయునట
చిలిపి చేష్టలతో వలపే కోరునట
ముద్దు తీర్చమని సద్దు చేయునట
మరులుకొనే బాల తను మనసు పడే వేళ
మరులుకొనే బాల తను మనసు పడే వేళ
ఉలికిపడి ఉనికిచెడి ఉక్కిరిబిక్కిరి అవుతాడంట
ఒహొహొ హొయ్ బావా బావా ,మరదలా

బావా బావా పన్నీరు బావకు మరదలు బంగారు
పరుగులు తీసే ఉరకలు తీసే బావను ఆపేరు

సుందరాంగుడట గ్రంధసాంగుడట
ఏడు మల్లెయల ఎత్తు తూగునట
సుందరాంగుడట గ్రంధసాంగుడట
ఏడు మల్లెయల ఎత్తు తూగునట
అలిగి కొనగోట ఆ చెంప ఇలా మీట
అలిగి కొనగోట ఆ చెంప ఇలా మీట
అబల వలే అదిరిపడి లబోదిబో అంటాడంట
ఒహొహొ హొయ్ బావా బావా,మరదలా

బావా బావా పన్నీరు బావకు మరదలు బంగారు
వలపులలోన జలకములాడ బావను తిప్పేరు
బావా బావా పన్నీరు బావకు మరదలు బంగారు
వలపులలోన జలకములాడ బావను తిప్పేరు
బావా బావా పన్నీరు బావకు మరదలు బంగారు
వలపులలోన జలకములాడ బావను తిప్పేరు
వలపులలోన జలకములాడ బావను ముంచేరు

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips