05 December 2010

ఓ మనసులోని మనసా ఏమిటె నీ రభస

ఓ మనసులోని మనసా ఏమిటె నీ రభస
ఏమిటే నీ రభస నా మనసులోని మనసా
ఏమిటే నీ రభస నా మనసులోని మనసా
ఏమిటే నీ రభస

ఇల్లు అలికిన పండుగటే,ఒళ్ళు తెలిసి మెలగరటె
ఇల్లు అలికిన పండుగటే,ఒళ్ళు తెలిసి మెలగరటె
పాలు కాచి చేజేతులొ ఒలకపోసుకుందురటే
పాలు కాచి చేజేతులొ ఒలకపోసుకుందురటే
ఏమిటే నీ రభస నా మనసులోని మనసా
ఏమిటే నీ రభస

నిజము తెలియనంతవరకే ఆటపాటలెన్నైనా
నిజము తెలియనంతవరకే ఆటపాటలెన్నైనా
అసలు రూపుపసిగడితే అధోగతి తప్పునటే
అసలు రూపుపసిగడితే అధోగతి తప్పునటే
ఏమిటే నీ రభస నా మనసులోని మనసా
ఏమిటే నీ రభస

హద్దుపద్దు లేకుండా పెద్దలతో ఆటలటే
హద్దుపద్దు లేకుండా పెద్దలతో ఆటలటే
జాణతనము చాలింపుము జానవులే నెరజాణవులే
జాణతనము చాలింపుము జానవులే నెరజాణవులే
ఏమిటే నీ రభస నా మనసులోని మనసా
ఏమిటే నీ రభస

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips