05 December 2010

మల్లెతీగ వాడిపోగ మరల పూలు పూయునా

మల్లెతీగ వాడిపోగ మరల పూలు పూయునా
తీగ తెగిన హృదయవీణ తిరిగి పాట పాడునా
మనసులోని మమతలన్ని మాసిపోయి కుములు వేళ మిగిలింది ఆవేదన
మల్లెతీగ వాడిపోగ మరల పూలు పూయునా

నిప్పు రగిలి రేగు జ్వాల నీళ్ళ వలన ఆరును
నీళ్ళలోనె జ్వాల రేగ మంట ఎటుల ఆరును
నీళ్ళలోనె జ్వాల రేగ మంట ఎటుల ఆరును

మల్లెతీగ వాడిపోగ మరల పూలు పూయునా
మనసులోని మమతలన్ని మాసిపోయి కుములువేళమిగిలింది ఆవేదన
తీగ తెగిన హృదయవీణ తిరిగి పాట పాడునా

కడలిలోన మునుగు వేళ పడవ మనకు తోడుర
పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా
పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా
ఆటగాని కోరికేమో తెలియలేని జీవులం
జీవితాల ఆటలోన మనమంతా పావులం

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips