05 December 2010

చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి

చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి
ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను
గాలి చిరుగాలి చెలిచెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమసందేశం
చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి
ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను
గాలి చిరుగాలి చెలిచెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమసందేశం

మూసారు గుడిలోని తలుపులను,ఆపారు గుండెల్లో పూజలను
దారిలేదు చూడాలంటే దేవతను,వీలుకాదు చెప్పాలంటే వేదనను
కలతైపోయె నా హృదయం,కరువైపోయె ఆనందం
అనురాగమీవేళ అయిపోయె చెరసాల
అనురాగమీవేళ అయిపోయె చెరసాల
అయిపోయె చెరసాల
గాలి చిరుగాలి చెలిచెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమసందేశం

నా ప్రేమరాగాలు కలలాయె,కన్నీటి కథలన్ని బరువాయె
మబ్బు వెనుక చందమామ దాగి ఉన్నదో
మనసు వెనుక ఆశలన్ని దాచుకున్నదో
వేదనలేల ఈ సమయం,వెలుతురు నీదే రేపుదయం
శోధనలు ఆగేను శోకములు తీరేను
శోధనలు ఆగేను శోకములు తీరేను
శోకములు తీరేను
గాలి చిరుగాలి చెలిచెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమసందేశం

చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి ఒక్కమాట వినిపోవాలి
ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను
గాలి చిరుగాలి చెలిచెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమసందేశం
ఈ నా ప్రేమసందేశం

No comments: