01 October 2011

ఆనాటి ఆ స్నేహమానందగీతం

ఆనాటి ఆ స్నేహమానందగీతం
ఆఙ్ఞాపకాలన్నీ మధురాతిమధురం
ఈనాడు ఆహాయి లేదే నేస్తం
ఆరోజులు మునుముందిక రావేమిరా ఆ ఆ
హ హ హ లేదురా సుఖం రాదురా ఆ గతం
ఏవిటో జీవితం అర్రె ఫూల్ గుర్తుందిరా
గోడలు దూకిన రోజులు మొకాలికి తగిలిన దెబ్బలు
చీకట్లో పిల్లనుకొని
ఒరే ఒరే ఈడియట్ పక్కనే పెళ్లి కావలసిన పిల్లలున్నార్రా
నేర్చుకుంటారా ఆ ఆ హ హ హ హ హ హ హ

నేను మారలేదూ నీవు మారలేదూ
కాలం మారిపోతే నేరం మనదేమి కాదూ
ఈ నేల ఆ నింగి ఆలాగే వున్నా
ఈ గాలి మోస్తుంది మన గాథలెన్నో
నెమరేసుకుందాము ఆరోజులు
భ్రమలాగ ఉంటాయి ఆ లీలలు
ఆ మనసులుఆ మమతలు ఏమాయెరా

ఒరే రాస్కెల్ ఙ్ఞాపకం ఉందిరా
కాలేజిలో క్లాస్ రూములో ఓపాపమీద
నీవు ఓ పేపర్ బాల్ తో కొడితే
ఆ పాప ఎడమ కాలి చెప్పు
ఒరే ఒరే స్కౌండ్రల్ ఊరుకోరా పిల్లలు వింటారు
వింటే వింటార్రా పిల్లల పిల్లలకు
పిట్టకథలుగా చెప్పుకుంటారు అంతే ఆ హ హ హ హ హ హ !!ఆనాటి!!

మనసే ఇచ్చినాను మరణం తెచ్చినాను
చితిలో చూసినాను చిచ్చై మండినాను
నాగుండె మంటింక ఆరేది కాదు
నేనుండి తనువెళ్లి బ్రతుకింక లేదు
తన శాపమే నాకు తగిలిందిరా రేయ్!
పసిపాపలే లేని ఇల్లాయిరా
ఈ కన్నుల కన్నీటికి తుదియేదిరా ఆ
ఒరే ఒరేయి ఎమిట్రా పసిపిల్లలాగ ఆ చీచీ ఊరుకో
ఒరేయి ఈ కన్నీళ్లకు తుది ఎక్కడరా
కర్చీఫ్ తో తుడ్చేయడమేరా ఆ ఆ హ హ హహహహహ

ఆనాటి ఆ స్నేహమానందగీతం
ఆఙ్ఞాపకాలన్నీ మధురాతిమధురం
హ హ హ హ రియల్లీ దోస్ డేస్ ఫ్యాబులెస్
ఆ కరెక్ట్రారా హా హా హా ల లా లా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips