01 October 2011

ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు

తోడు నీడగా వుండే వయసున గూడు విడిచి వేరైనారు గూడు విడిచి వేరైనారు
ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు

జంటను వీడిన ఒంటరి బ్రతుకై జాలిగ కుమిలేరు

ఎదలోదాగిన మూగ వేదన ఎవరికి చెప్పేరు ఎలా భరించేరు
ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు

ఒకే తనువుగ ఒకే మనువుగా ఆ దంపతులు జీవించారు
ఒకే తనువుగ ఒకే మనువుగ ఆ దంపతులు జీవించారు
ఆస్తిపాస్తివలె అన్నదమ్ములు ఆ తలిదండ్రుల పంచారు ఆ తలిదండ్రుల పంచారు
ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips