01 October 2011

నువ్వూ నేనూ ఏకమైనాము

నువ్వూ నేనూ ఏకమైనాము
నువ్వూ నేనూ ఏకమైనాము
ఇద్దరము మనమిద్దరము ఒక లోకమైనామూ
లోకమంతా ఏకమైనా వేరు కాలేము వేరు కాలేము
నువ్వూ నేనూ ఏకమైనాము

కళ్ళు నాలుగు కలిపి మనమూ ఇల్లు కడద్దామూ
అందులో మన చల్ల చల్లని వలపు దీపం నిలుపుకుంద్దాము
కళ్ళు నాలుగు కలిపి మనమూ ఇల్లు కడద్దామూ
అందులో మన చల్ల చల్లని వలపు దీపం నిలుపుకుంద్దాము
పసిడి మనసులు పట్టెమంచం వేసుకుంద్దాము ఊ ఉ
అందులో మన పడుచు కోర్కెల మల్లెపూలు పరుచుకుంద్దాము ఊ ఉ
నువ్వూ నేనూ ఏకమైనాము

చెలిమితో ఒక చలువపందిరి వేసుకుంద్దాము
కలల తీగల అల్లిబిల్లిగా అల్లుకుంద్దాము ఊ
ఆ అల్లికలను మన జీవితాలకు పోల్చుకుంద్దాము
ఏ పొద్దు కానీ వాడిపోనీ పువ్వులవుద్దామూ ఊ ఊ
నువ్వూ నేనూ ఏకమైనాము

లేత వెన్నెల చల్లదనము నువ్వు తెస్తావూ ఊ
అందులో నీరెండలోని వెచ్చదనము నువ్వు ఇస్తావు
లేత వెన్నెల చల్లదనము నువ్వు తెస్తావూ ఊ
అందులో నీరెండలోని వెచ్చదనము నువ్వు ఇస్తావు
సూర్యచంద్రులు లేని జగతిని సృష్టి చేద్దాము ఊ ఊ
అందులో ఈ సృష్టికెన్నడు లేని సొగసు మనము తెద్దాము

నువ్వూ నేనూ ఏకమైనాము
ఇద్దరము మనమిద్దరము ఒక లోకమైనామూ
లోకమంతా ఏకమైనా వేరు కాలేము వేరు కాలేము
నువ్వూ నేనూ ఏకమైనాము ఆహ హా ఆహ ఆహ హా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips