01 October 2011

ఆకులు పోకలు ఇవ్వద్దు నోరు ఎర్రగ చేయద్దు

ఆకులు పోకలు ఇవ్వద్దు నోరు ఎర్రగ చేయద్దు
ఆకులు పోకలు ఇవ్వద్దు నా నోరు ఎర్రగ చేయద్దు
ఆశలు నాలో రేపద్దు నా వయసుకు అల్లరి నేర్పద్దు పాపా పాపా
ఆకులు పోకలు ఇవ్వద్దు నోరు ఎర్రగ చేయద్దు
ఆకులు పోకలు ఇవ్వద్దు నా నోరు ఎర్రగ చేయద్దు
ఆశలు నాలో రేపద్దు నా వయసుకు అల్లరి నేర్పద్దు మావా మావా

ఊరుకొన్న నన్ను నువ్వే ఊరించావు
నే నోపలేనంతగా ఉడికించావు
ఊరుకొన్న నన్ను నువ్వే ఊరించావు
నే నోపలేనంతగా ఉడికించావు
ఊరించానా నిన్నుడికించానా
ఊరించానా నిన్నుడికించానా
ఉత్తొత్తి నిందలేస్తే ఊరుకోనూ
నాకుడుకెక్కిందంటే నేనూరుకోనూ పాపా పాపా
ఆకులు పోకలు ఇవ్వద్దు నా నోరు ఎర్రగ చేయద్దు
ఆశలు నాలో రేపద్దు నా వయసుకు అల్లరి నేర్పద్దు పాపా పాపా మావా పాపా

ఎర్రని పెదవిని పంట నొక్కకు
నన్ను వెర్రివాణ్ణి చేసి నీ వెంట తిప్పకు
ఎర్రని పెదవిని పంట నొక్కకు
నన్ను వెర్రివాణ్ణి చేసి నీ వెంట తిప్పకు
పంట నొక్కానా నే వెంట తిప్పానా
పంట నొక్కానా నే వెంట తిప్పానా
గజ్జల గుర్రమంటి కన్నె పిల్లకు
కళ్ళతోటి కళ్ళమేసి కదం తొక్కకూ మావా మావా
ఆకులు పోకలు ఇవ్వద్దు నా నోరు ఎర్రగ చేయద్దు
ఆశలు నాలో రేపద్దు నా వయసుకు అల్లరి నేర్పద్దు మావా మావా పాపా మావా

ముద్దు ముద్దుగా నన్ను చూసుకున్నావు
వద్దు వద్దన్న నిన్ను నేనొదిలి పెట్టను
ముద్దు ముద్దుగా నన్ను చూసుకున్నావు
వద్దు వద్దన్న నిన్ను నేనొదిలి పెట్టను
వద్దన్నానా ననొదలమన్నానా
పొద్దంతా నీతోటే గడచిపోతది
నీ ముద్దు మొగంతోనె నాకు పొద్దు పొడిచేది పాపా పాపా
ఆకులు పోకలు ఇవ్వద్దు నా నోరు ఎర్రగ చేయద్దు
ఆశలు నాలో రేపద్దు నా వయసుకు అల్లరి నేర్పద్దు మావా పాపా మావా పాపా

No comments: