01 October 2011

ఎవ్వరిది ఈ పిలుపు ఎక్కడిది ఈ వెలుగు

ఎవ్వరిది ఈ పిలుపు ఎక్కడిది ఈ వెలుగు
ఎవ్వరిది ఈ పిలుపు ఎక్కడిది ఈ వెలుగు
నీవై వెలిగినది ఈ నీలో పలికినది ఈ ఈ
నీవై వెలిగినది ఈ నీలో పలికినది
పిలిచిన పిలుపెల్లా నాదలై ఆ మ్రోగినదీ
ఆ రాగాలై సాగినవి మానసవీణై వెలసినది

ఎవ్వరిది ఈ వీణా ఎక్కడిది ఈ జాణా
నాలోని నీ రూపమే ఆ ఆ నాలోని నీ భావమే
ఎవ్వరిది ఈ పిలుపు ఎక్కడిది ఈ వెలుగు
నీవై వెలిగినదీ నీలో పలికినది

చుక్కల్నీ ఒలిచీ చక్కంగా మలిచి
నీ కంఠహారాన్ని చేయించనా ఆ ఆ
సూర్యుణ్ణి అడిగి కిరణాలు తొడిగి
నీ ముంగిటే ముగ్గు వేయించనా ఆ ఆ
ప్రాణాలు ఐదు నీలోనా ఖైదై ఆరోది నీవై జీవించనా
ప్రాణాలు ఐదు నీలోనా ఖైదై ఆరోది నీవై జీవించనా
ఎవ్వరిది ఈ వీణా ఆ ఎక్కడిది ఈ జాణా
నాలోని నీ రూపమే ఆ ఆ నాలోని నీ భావమే

తనువెల్లా మనసై మనసెల్లా కనులై
నెలలన్నీ దినమల్లే గడిపేయనా
నాకున్న రుచులు నీకున్నా కళలు
కలబోసి ప్రతిరోజు విందివ్వవా
నేనివ్వగలది ఈ ఏ జన్మములది
ఇక ముందు ఎంతో మిగిలున్నది
ఎవ్వరిది ఈ వీణా ఎక్కడిది ఈ జాణా
నాలోని నీ రూపమే ఆ ఆ నాలోని నీ భావమే
ఎవ్వరిది ఈ పిలుపు ఎక్కడిది ఈ వెలుగు
నీవై వెలిగినదీ ఈ నీలో పలికినది ఈ
నీవై వెలిగినదీ ఈ నీలో పలికినది

No comments: