01 October 2011

మనసే మన ఆకాశం మనమే రవిచంద్రులం

మనసే మన ఆకాశం మనమే రవిచంద్రులం
ఇటు పగలు అటు రేయి ఒకటై వెలిగే ప్రేమికులం
మనసే మన ఆకాశం మనమే రవిచంద్రులం

ఒహొహో అహహా చందమామ నువ్వంట
వెన్నెల్లే నువ్వంట
నీ ముందు నేనుంటే దివిటీలా ఉంటా
సూరీడి వెచ్చనీ నీరెండ నువ్వంట
నీ మాట అనుకుంటే మాటలే రావంట
మాటలకందని మనిషివి నువ్వంట
మాటలకందని మనిషివి నువ్వంట
మనుషులకందని మమతే నీదంట

మనసే మన ఆకాశం మనమే రవిచంద్రులం
ఇటు పగలు అటు రేయి ఒకటై వెలిగే ప్రేమికులం
మనసే మన ఆకాశం మనమే రవిచంద్రులం

నీకు నీవారుంటే నాకోసం నువ్వుంట
ఏ ఏటి ఒడ్డున ఇల్లేల మనకంట
నీ ఒంటి వానికి నీ జంట ఇల్లంట
ఆ ఇంట గోరంత దీపమై నేనుంటా
గోరంత దీపానికి ఇల్లంతా వెలుగంట
గోరంత దీపానికి ఇల్లంతా వెలుగంట
కొండంత దేవునికి కోవెలే నేనంట
మనసే మన ఆకాశం మనమే రవిచంద్రులం

No comments: