01 October 2011

నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా

నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా
నీకు అంతలోనె నన్ను చూస్తె ఇంత సిగ్గా
నిన్న మొన్న రెక్కలొచిన గండు తుమ్మెద
నీకు అంతలోనె నన్ను చూస్తె ఇంత తొందరా ||నిన్న మొన్న||

పరికిణీలు కట్టినపుడు లేని సొగసులు
నీ పైట కొంగు చాటున దోబూచులాడెను ||2||
పసితనాన ఆడుకొన్న తొక్కుడు బిళ్ళలు
నీ పరువానికి నేర్పినవి దుడుకు కోర్కెలు ||2||||నిన్న మొన్న||

పాల బుగ్గలు పూచె లేత కెంపులు
వాలు చూపులందుతోటె వయసు జోరులు ||2||
చిరుత నవ్వులు ఒలికె చిలిపితనాలు
చిన్ననాటి చెలిమి తీసె వలపు దారులు ||2||||నిన్న మొన్న||

ఇన్నాళ్ళు కళ్ళు కళ్ళు కలిపి చూస్తివి
ఇపుడేల రెప్పలలా రెపరెపన్నవి ||2||
ఇన్నాళ్ళు నీ కళ్ళు ఊరుకున్నవి ఇపుడేవేవో
ఇపుడేవేవో మూగబాస లాడుతున్నవి ||2||||నిన్న మొన్న||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips