01 October 2011

పిల్లలము బడి పిల్లలము

పిల్లలము బడి పిల్లలము
పిల్లలము బడి పిల్లలము
నడుములు కట్టి కలిశాము పిడికిలి బిగించి కదిలాము
పిల్లలము బడి పిల్లలము

పలక బలపం పట్టిన చేతులు పలుగు పార ఎత్తినవి పలుగు పార ఎత్తినవి
పలక బలపం పట్టిన చేతులు పలుగు పార ఎత్తినవి
ఓనమాలను దిద్దిన వేళ్ళు ఒకటై మట్టిని కలిపినవి
ఒకటై మట్టిని కలిపినవి
పిల్లలము బడి పిల్లలము

ప్రతి అణువు మా భక్తికి గుర్తు
ప్రతి రాయి మా శక్తికి గుర్తు
ప్రతి అణువు మా భక్తికి గుర్తు
ప్రతి రాయి మా శక్తికి గుర్తు

చేతులు కలిపి చెమటతో తడిపి
చేతులు కలిపి చెమటతో తడిపి
కోవెల కడదాం గురుదేవునికి
పిల్లలము పిల్లలము బడి పిల్లలము బడి పిల్లలము

తెలియని వాళ్ళకు తెలివిగల వాళ్ళకు
తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు
తెలియని వాళ్ళకు తెలివిగల వాళ్ళకు
తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు
వెలుగును ఇచ్చే ఈ కిటికీలు పంతులు గారి చల్లని కళ్ళు
వెలుగును ఇచ్చే ఈ కిటికీలు పంతులు గారి చల్లని కళ్ళు

పిల్లలము పిల్లలము బడి పిల్లలము బడి పిల్లలము
నడుములు కట్టి కలిశాము పిడికిలి బిగించి కదిలాము
పిల్లలము బడి పిల్లలము ల లాలా లా లా లా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips