01 October 2011

నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిముష మాగుమా

నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిముష మాగుమా
నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా
కన్నె అందమా కలత మానుమా ఒక్క నిముషమాగుమా
నీ దైవము నీ కోసము యెదుట నిలిచె చూడుమా

ఆనుకోని రాగాలు వినిపించేనే
కనరాని స్వర్గాలు దిగివచ్చేనే
ఆనుకోని రాగాలు వినిపించేనే
కనరాని స్వర్గాలు దిగివచ్చేనే
కలలు పండి నిజముగా కనుల యెదుట నిలిచెగా
రా జాబిలి నా నెచ్చలి జాగేల ఈ వేళ నను చేరగా
నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిముష మాగుమా
నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా ఆ ఆ

కళ్యాణ మేళాలు మ్రోగించనా
కంఠాన సూత్రాన్ని ముడివేయనా
కళ్యాణ మేళాలు మ్రోగించనా
కంఠాన సూత్రాన్ని ముడివేయనా
గుండె గుడిగా చేయనా నిన్ను కొలువు తీర్చనా
నీ దాసినై సావాసినై నా ప్రేమ పుష్పాల పూజించనా
కన్నె అందమా కలత మానుమా ఒక్క నిముషమాగుమా
నీ దైవము నీ కోసము యెదుట నిలిచె చూడుమా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips