29 October 2011

నేను తానని అనుకుంటారా

ఓహోహో హోహోహో హోహో
ఓహోహో హోహోహో హోహో
నేను తానని అనుకుంటారా
నేనే తానని అనుకోనా
ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా
ఆడ మగ అని తేడా ఉందని అభిమానానికి చెబుతారా
స్నేహం మోహం రెండు వేరని తెలిసి తప్పుకు పోతారా

ఓహోహో హోహోహో హోహో
ఒకే చోటే ఉంటూ ఒకటే కల కంటూ
విడివిడిగా కలిసే ఉండే కలలది ఏ బంధం
కలకాలం వెంటే నడవాలనుకుంటే
కాళ్ళకి ఓ ముడి ఉండాలని ఎందుకు ఈ పంతం
చుట్టరికం ఉందా చెట్టుతో పిట్టకేదో
ఏమి లేకపొతే గూడు కడితే నేరమా
ఏ చెలిమి లేదా గట్టుతో ఏటికేదో
వివరించమంటే సాధ్యమా

నేను తానని అనుకుంటారా
నేనే తానని అనుకోనా
ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా
ఆడ మగ అని తేడా ఉందని అభిమానానికి చెబుతారా
స్నేహం మోహం రెండు వేరని తెలిసి తప్పుకు పోతారా

కనులకు కనిపించే రూపం లేకుంటే
ప్రాణం తాను ఉన్నానన్నా నమ్మం అంటారా
చెవులకు వినిపించే సవ్వడి చేయందే
గుండెల్లో కదిలే నాదం లేదని అంటారా
మదిలో భావం మాటలో చెప్పకుంటే
అటువంటి మౌనం తగనిదంటూ అర్ధమా
తీరాన్ని నిత్యం అల అలా తాకుతుంటే
నిలిపే నిషేధం న్యాయమా

నేను తానని అనుకుంటారా
నేనే తానని అనుకోనా
ఇద్దరిగా కనిపించడమే మా తప్పంటారా
ఆడ మగ అని తేడా ఉందని అభిమానానికి చెబుతారా
స్నేహం మోహం రెండు వేరని తెలిసి తప్పుకు పోతారా

No comments: