01 October 2011

ఏ రాగమో ఇది ఏ తాళమో

ఏ రాగమో ఇది ఏ తాళమో
ఏ రాగమో ఇది ఏ తాళమో
అనురాగాని కనువైన శృతి కలిపినాము
ఆహా ఊహూ ఆహా ఉహూ

ఏ రాగమో ఇది ఏ తాళమో
ఏ రాగమో ఇది ఏ తాళమో
మన కళ్యాణ శుభవేళ మోగించు మేళమో
ఏ రాగమో ఇది ఏ తాళమో

ఎదలో మెదిలే సంగతులన్నీ పలికెను సంగీతమై ఈ
పలికెను సంగీతమై
కలిసిన కన్నుల మెరిసేకలలే వెలిసెను గమకములై ఈ
వెలిసెను గమకములై

హొయలైన నడకలే లయలైనవవవి
చతురాడు నవ్వులే గతులైనవి
సరిసరి అనగానే మరిమరి కొసరాడు
మురిపాలె మనజంట స్వరమైనది
ఏ రాగమో ఇది ఏ తాళమో
మన కళ్యాణ శుభవేళ మోగించు మేళమో
ఏ రాగమో ఇది ఏ తాళమో

విరికన్నె తనకు పరువమే కాదు పరువూ కలదన్నది ఈ
పరువు కలదన్నది
భ్రమరము తనకు అనుభవమే కాదు అనుబంధమున్నది ఈ
అనుబంధమున్నది
కోకిలమ్మ గుండెకు గొంతున్నది
కొమ్మలో దానికి గూడున్నది
సరిమగవానికి సగమని తలపోయు
మనజంటకే జంటసరి ఉన్నది
ఏ రాగమో ఇది ఏ తాళమో
అనురాగాని కనువైన శృతి కలిపినాము
ఏ రాగమో ఇది ఏ తాళమో

No comments: