01 October 2011

నేనీదరిని నువ్వాదరినీ

నేనీదరిని నువ్వాదరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ ఈ ఈ

నేనీదరిని నువ్వాదరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ ఈ ఈ

కనకదుర్గ కనుసన్నలలో గలగల పారే తన ఒడిలో
కనకదుర్గ కనుసన్నలలో గలగల పారే తన ఒడిలో
మన పడవలు రెండూ పయనించాలని
బ్రతుకులు నిండుగ పండించాలని
కలిపింది ఇద్దరినీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

నీ కురుల నలుపులో నీ కనుల మెరుపులో
అలలై కలలై అలలై కలలై తానే వెలిసింది
నీ లేత మనసులో నీ దోర వయసులో
వరదై వలపై వరదై వలపై తానే ఉరికిందీ

చిరుగాలుల తుంపరగా చిరునవ్వుల సంపదగా
చిరుగాలుల తుంపరగా చిరునవ్వుల సంపదగా
మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ ఈ ఈ

పంట పొలాల్లో పచ్చదనంగా పైరగాలిలో చల్లదనంగా
పంట పొలాల్లో పచ్చదనంగా పైరగాలిలో చల్లదనంగా
పల్లెపదంలో తీయదనంగా
చిరంజీవులై జీవించాలని
కలిపింది ఇద్దరినీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

No comments: