01 October 2011

ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై

ఆ ఆ ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై
ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై
కనుగొంటిని ఆ దేవిని
అభినందనం అభినందనం అభినందనం

వాణియై నాకు బాణియై ఏ దయ నా హృది మీటెనో
వాణియై నాకు బాణియై దయ నా హృది మీటెనో
వాణియై నాకు బాణియై ఏ దయ నా హృది మీటెనో
ఆ మూర్తికి స్త్రీ మూర్తికి అభినందనం అభినందనం అభినందనం

ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై
సప్తస్వరాల హరివిల్లునైతీ
ఉషోదయాన కాంతి తానై తుషార బిందువు నేనై
సప్తస్వరాల హరివిల్లునైతీ
ఆ కాంతికి నా రాగామాలికలర్పిస్తున్న
మీ అందరి కరతాళహారతులర్ధిస్తున్న
నేడే అర్చన సమయం నా నవ జీవన ఉదయం
ఎదలో మమతా గీతం గుడిలో ఘంటా నాదం
ఇది నా తొలి నైవేద్యం
ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై

వసంత కాల కోకిలమ్మ జన్మాంతరాల ఋణమా
నీ ఋణం ఏ రీతి చెల్లింతునమ్మా
నా జీవితమే ఇక నీ పదపీఠం
నీ దీవెనలే నాకు మహా ప్రసాదం
నేడే నా స్వర యజ్ఞం
నేడే ఆ శుభలగ్నం చెలిమే చేసిన భాగ్యం
మదిలో మెదిలే రాగం ఇక నా బ్రతుకే ధన్యం
ఎవ్వరో పాడారు భూపాల రాగం సుప్రభాతమై
కనుగొంటిని ఆ దేవిని అభినందనం అభినందనం అభినందనం

No comments: