22 June 2010

వీచె గాలులలో వినబడు రాగమూ

వీచె గాలులలో వినబడు రాగమూ
కదిలె ఆకులలొ కలదొక తాళమూ
జగమె పాట కచేరీ మనసానంద విహారి
జగమె పాట కచేరీ మనసానంద విహారి

||వీచె గాలులలొ||

గల గల గల జల జల జల
సెలయేరులలొ వింటే సంగీతమే లేదా
టప టప టప చిట పట చిట
తొలి చినుకులలొ వానే స్వర ధారలె
మడి సొరగులలొ పని సమయము లొ
మాటే పాట గా జాన పదమాయెరా
పని లొ పాట కచేరి మనసానంద విహారి

||వీచె గాలులలొ||

గణ గణ గణ ఝుణ ఝుణ ఝుణ
గుడి గంటలొ లేద ఒంకారమై వేదం
ఢక ఢక ఢక దక దక దక మను
గుండెలలొ లేదా ఓ నాదమే
చిరు నగవులతో పసి పాపలకై
పాడే తల్లికీ సరిగమ తెలియునా
జోజో లాలి కచేరీ మనసానంద విహారీ

||వీచె గాలులలొ||

No comments: